BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
టీటీడీ: పట్టు శాలువాలా? పాలిస్టర్వా? వెంకన్న సేవల్లో, వీవీఐపీలకు వేదాశీర్వచనాల్లో వాడే వస్త్రాల నాణ్యతపై ఏమిటీ వివాదం?
టీటీడీ పట్టు శాలువాల కొనుగోళ్లలో అవినీతి జరిగినట్లు, దీనిపై విచారణ ప్రారంభించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. 2019 నుంచి ఇప్పటివరకు ఏటా దాదాపు రూ. 80–90 కోట్ల అవినీతి జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నామని తెలిపారు.
షాహిద్ అఫ్రిది: గంభీర్‌పై విమర్శలు, విరాట్, రోహిత్‌లపై ప్రశంసలు.. ఈ పాకిస్తానీ క్రికెటర్ మళ్లీ పాతరోజులను గుర్తు చేస్తున్నాడా?
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేలలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రదర్శన కూడా చర్చనీయాంశంగా మారగా, వీరిద్దరిపై మాత్రం అఫ్రిది ప్రశంసలు కురిపించాడు.
విదేశీ సంపన్నుల కోసం 'గోల్డ్ కార్డ్' వీసా స్కీమ్ ప్రారంభించిన ట్రంప్, దీని ధర ఎంతంటే..
సంపన్న విదేశీయులకు వేగంగా అమెరికా వీసాలను అందించే పథకాన్ని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రారంభించారు. ఈ వీసా పొందేందుకు 1 మిలియన్ డాలర్లు అంటే, భారత కరెన్సీలో దాదాపు 9 కోట్ల రూపాయలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది.
వెనెజ్వెలా తీరంలో ఆయిల్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నామన్న ట్రంప్, అమెరికాను సముద్రపు దొంగలుగా వర్ణించిన వెనెజ్వె���ా మంత్రి
"మేం వెనెజ్వెలా తీరంలో ఒక ట్యాంకర్‌ను సీజ్ చేశాం. అది చాలా పెద్దది. ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకున్న వాటిలో అతిపెద్ద ట్యాంకర్" అని ట్రంప్ వైట్‌హౌస్‌లో జర్నలిస్టులతో చెప్పారు. ఈ చర్యను తీవ్రమైన అంతర్జాతీమ దోపిడీగా వెనెజ్వెలా పేర్కొంది.
జస్వీన్ సంఘా: ‘కెటామైన్ క్వీన్’గా పేరున్న ఈ సంపన్న యువతి డ్రగ్స్ ప్రపంచంలో ఎంత సీక్రెట్‌గా ఉండేవారు?
ప్రముఖ నటుడు మాథ్యూ పెరీకి 50 సీసాల కెటామైన్‌ను ఆమె సరఫరా చేశారు. 2023లో డ్రగ్స్ ఓవర్‌డోస్ అయ్యి ఆయన మరణానికి దారితీయడంతో ఆమె చేసే వ్యాపారం, ఆకర్షణీయమైన జీవితం ఒక్కసారిగా కుప్పకూలాయి.
వరదల్లో చనిపోయాడనుకుంటే వీడియోకాల్‌లో కుటుంబాన్ని పలకరించిన వ్యక్తి
శివం కుటుంబం పుణె వచ్చి ఆయన్ను కలుసుకున్నారు. కానీ, దొంగతనం కేసు విచారణలో ఉండటంతో ఆయనను వెంటనే విడుదల చేయలేకపోయారు.
అమెరికా వెళ్లాలంటే సోషల్ మీడియా చరిత్ర చెప్పాల్సి రావొచ్చు, ఆ 40 దేశాలకు ఎఫెక్ట్- అసలేంటీ నిబంధనలు?
సోషల్ మీడియా సమాచార సేకరణతో పాటు, దరఖాస్తుదారు గత ఐదు, పదేళ్లలో ఉపయోగించిన టెలిఫోన్ నంబర్లు ఈమెయిల్ అడ్రస్‌లు, వారి కుటుంబ సభ్యుల గురించి మరింత సమాచారాన్ని సేకరించాలని ఈ షరతులు ప్రతిపాదిస్తున్నాయి.
వీడియో, 'సెలవులకు ఇంటికెళ్లి వస్తే ప్రెగ్నెన్సీ టెస్ట్ అడుగుతున్నారు' అంటూ విద్యార్థినుల ఆందోళన.., వ్యవధి 7,28
ఈ టెస్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని మహారాష్ట్ర గిరిజన అభివృద్ధి కమిషనర్ లీనా బన్సోద్ అన్నారు. అయితే ఈ పరీక్షలను నిలిపేయాలని ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా కొనసాగుతున్నాయని విద్యార్ధినులు అంటున్నారు.
'నీట్'లో సీటు రాకపోయినా వైద్య రంగంలో మరెన్నో అవకాశాలు.. ప్లాన్ 'బీ'కి ఇలా సిద్ధం కావొచ్చు
ఏటా లక్షలాది మంది విద్యార్థులు నీట్ పరీక్షకు పోటీపడుతున్నారు. చాలామంది సఫలమవుతున్నారు, కానీ అర్హత సాధించలేకపోతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. మరి మిగిలిపోయిన వారి పరిస్థితేంటి? వారి ముందున్న ఆప్షన్లేంటి? ప్లాన్ బీకి ఎలా సిద్ధమవ్వాలి? అనే విషయాలు ఈ కెరీర్ కనెక్ట్‌లో తెలుసుకుందాం.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
షార్ట్ వీడియోలు
ఫీచర్లు
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
భూతకోల: ఏమిటీ ఆచారం, బయటి ప్రాంతాలలో దీనిని ప్రదర్శించకూడదా?
బయటివారికి ఇదొక వేషంలా కనిపిస్తుంది కానీ, తుళు ప్రజలకు మాత్రం ఆ రూపం దైవం. అందుకే బయట ప్రాంతాల్లో దీన్ని ప్రదర్శించడానికి వారు ఇష్టపడరు. వేషంగా వేసుకుంటే సహించరు. భక్తితో పాటు భయం ఉంచడం కూడా లక్ష్యం అంటారు.
తెలుగుప్రజలు అరుణాచలానికి ఎక్కువగా ఎందుకు వెళతారు?
18వ శతాబ్దం నాటికే అరుణాచలం దగ్గర తెలుగు శాసనాలు కనిపించాయి. ప్రస్తుత అరుణాచల గోపుర నిర్మాణం ప్రారంభించింది శ్రీకృష్ణదేవరాయలు అయితే, దాన్ని పూర్తి చేసింది తంజావూరు తెలుగు పాలకుడు సేవప్ప నాయకుడు.
'ఇంకా పెళ్లెందుకు చేసుకోలేదు, ఏదైనా సమస్యా?'-అని పెళ్లి చేసుకోనివారిని అంటే..
''సమాజంలో ఒంటరిగా నివసిస్తున్న, విడాకులైన, లేదా భాగస్వాములను కోల్పోయిన వారి లైంగిక అవసరాల గురించి ఎవరూ మాట్లాడరు.''
కోడలికి కాఫీ పెట్టే అత్త, అత్తను అమ్మలా చూసుకునే కోడలు, ఈ మార్పు ఎలా వచ్చింది?
మన సమాజంలో అత్తా కోడళ్లకు సరిగా పొసగదనే అభిప్రాయం ఉంది.ఈ అత్తాకోడళ్ల ‘బంధం’ మీదనే సంవత్సరాల పాటు నడిచే సీరియళ్లు ఉన్నాయి. అయితే సమాజంలో ఉండే పాపులర్ పరసెప్సన్కు భిన్నంగా ఫ్రెండ్లీగా జీవించే అత్తా కోడళ్లు కూడా ఉన్నారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.
























































